‘నీవెవరో’ టీజర్ ఎప్పుడంటే ?

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కెతున్న చిత్రం ‘నీవెవరో’. ఈ చిత్రం ద్వారా హ‌రినాధ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. క‌న్న‌డ చిత్రం ‘అదే కంగ‌ల్’ కు రీమేక్ ఇది. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఆది అంధుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌లో కలైయారసన్‌ హరికృష్ణనన్‌ కనిపించిన పాత్ర ఇది. ఈ సినిమా టీజర్ ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు.

ఆదిపినిశెట్టి హీరో పాత్రలతో పాటు.. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను చేస్తున్నారు. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో ఆది పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ చెక్కేసిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ.. అక్కడ బాగానే రాణిస్తోంది. తెలుగులోనూ మంచి కథలు వస్తే నటిస్తానని తెలిపింది. ఇటీవల ఆమె నటించిన తెలుగు సినిమా ఆనందో బ్రహ్మో విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ఇక, గురుతో తెలుగు తెరకు పరిచయమైన రుతికా సింగ్.. లారెన్స్ శివలింగలో మెరిసింది. నటన, గ్లామర్ తో ఆకట్టుకొంది. వీరందరు కలిసి నటిస్తున్న నీవెవరో ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి.