గీతని భలే ఎత్తాడబ్బా !

విజయ్ దేవరకొండని ఇప్పటికీ ‘అర్జున్ రెడ్డి’లానే చూస్తున్నారు. ఐతే, గీత గోవిందం`లో మాత్రం నేను చాలా మారిపోయాను. అయామ్ డీసెంట్ నౌ అంటున్నాడు. ఐతే, ఈ సినిమా పోస్టర్స్ లో మాత్రం విజయ్ పెద్దగా మారినట్టు కనబడుతోంది. ఆయనలోని రొమాంటి యాంగిల్ అలానే ఉన్నట్టు కనబడుతోంది. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటి వరకు ఆయన హీరోయిన్ రష్మికని కసిగా నే చూస్తున్నాడు.

ఇక సినిమా విడుదలకి నాలుగు రోజులే అంటూ తాజాగా విజయ్ దేవరకొండ ఓ కొత్త పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో మాత్రం రొమాంటిక్ కోణం మరింత బలంగా కనిపిస్తోంది. గోవిందం తన గీతని భలే ఎత్తాడబ్బా ! అని నెటిజర్స్ చెప్పుకొంటున్నారు. కొంపదీసీ అర్జున్ రెడ్డి మాదిరిగా గీతని ముద్దుల్లో ముంచేయడుగా.. ! పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది.