బెల్లకొండ బిల్దప్ విన్నారా !


బెల్లకొండ్ద శ్రీనివాస్ – కాజల్ జంటగా నటించిన చిత్రం ‘కవచం’. మెహ్రీన్ మరో హీరోయిన్. శ్రీనివాస్ మామిళ్ల దర్శకుడు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా నుంచి కొత్త సాంగ్ ని విడుదల చేశారు. సినిమాలో హీరో తన స్వభావం గురించి చెప్పుకొనే పాట ఇది. ‘నా అడుగే పడితే అణుయుద్ధం.. మొదలవుతుంది అనునిత్యం.. అని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో. నే చిటికే వేస్తే భూగోళం .. వెళ్లిపోతుంది పాతాళం .. అని ఎక్కడ లేని బిల్డప్ ఇవ్వను బ్రో.. ‘ అంటూ సాగుతోంది.

బెల్లకొండ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. కవచం ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ నే అయినా.. ఎవరు టచ్ చేయని పాయింట్ తో చెప్పబోతున్నారంట. బెల్లకొండ గత సినిమాలతో పోలీస్తే ఈ సినిమా కోసం తక్కువ బడ్జెట్ ని ఖర్చుపెట్టారు. అన్నీ కలిపి రూ. 30కోట్లు ఖర్చుపెట్టాం. అది తన మార్కెట్ తగిన బడ్జెట్ అని బెల్లకొండ చెబుతున్నారు. ఇక, ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.