అక్కడ అడుగుపెడుతున్న మెగా డాటర్

niharika (4)

‘ఒక మనసు’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారిక. అయితే ఈ సినిమా నిరాశ పరచడంతో తన తర్వాతి చిత్రంకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడో తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిహా.
తమిళ్ హీరో విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో నిహారిక ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిహారిక తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారావెళ్ళించింది. తన తర్వాతి ప్రాజెక్టు తమిళంలో ట్వీట్ చేసింది నిహా. అరుముగన్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

ఇక తెలుగులో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది నిహ. అవసరాలా శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చెస్తుందని సమాచారం. ప్రస్తుతం సబ్జెక్ట్ పై చర్చలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్ వుంది. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారాని టాక్.