నిహారిక పెళ్లి ప్రకటన


మెగాబ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లిపై ప్రకటన చేశారు. త్వరలోనే నిహారికకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. మంచి అబ్బాయి కోసం చూస్తున్నామన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కుటుంబం, రాజకీయాలకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘ 2018 వరకు నీహారికకు టైం ఇచ్చాం. ఇప్పుడు మంచి సంబంధం వస్తే పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నాం. మంచి వ్యక్తి, తన కాళ్లపై తాను నిలబడే వాడైతే చాలు. తన కాపు కులాన్ని గౌరవిస్తానని, తమ కులంలో మంచి అబ్బాయి దొరికితే మంచిదే, లేదంటే వేరే కులం వాళ్లైనా తనకు అభ్యంతరం లేదు’ అన్నారు నాగబాబు.

ముందుగా బుల్లితెరపై పేరు తెచ్చుకొన్న నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం సూర్యకాంతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైఅన్ సూర్యకాంతం టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యకాంతం తో నిహారిక తొలి హిట్ కొట్టేసే కనబడుతోంది.