చందూతో నితిన్ ఫిక్స్

నితిన్‌ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈరోజు హోలీ పండుగను పురస్కరించుకుని నితిన్‌ ట్విటర్‌ వేదికగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ ప్రకటన చేశారు.

‘ముందుగా చెప్పినట్లుగానే నా కొత్త సినిమాలకు సంబంధించిన మొదటి ప్రకటన. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న చంద్రశేఖర్‌ యేలేటితో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తారు. చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు నితిన్‌.

ప్రస్తుతం నితిన్‌.. ‘భీష్మ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో నితిన్‌కు జోడీగా రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాదీలా వుంటే రమేష్ వర్మ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు నితిన్. ఈ సినిమా ప్రకటన కూడా వచ్చంది.