నితిన్ ఆఫర్ – పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే రావొచ్చు ..

లై, ఛల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం ఇలా వరుస ప్లాప్స్ అందుకున్న నితిన్..దాదాపు గా పది నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. ఛలో డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు..రష్మిక హీరోయిన్ అని ప్రచారం అవుతుంది తప్ప ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఇప్పటికే పలు డేట్స్ చేంజ్ చేయగా..తాజాగా జూన్ 05 న ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుందని అంటున్నారు.

మరోపక్క నితిన్ పెద్ద డైరెక్టర్స్ వైపు చూస్తున్నాడని..చిన్న డైరెక్టర్స్ తో సినిమా చేస్తే అసలు కలిసి రావడం లేదని ..ఒకవేళ సినిమాలు చేసిన అది వర్క్ అవుట్ కావడం లేదని వాపోతున్నాడట. వినాయక్..బోయపాటి శ్రీను ఇలా ఎవరైనా అగ్ర దర్శకులు కథలు తీసుకొస్తే సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని..డేట్స్ ఎప్పుడంటే అప్పుడు ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడట. మరి నితిన్ ఆఫర్ కు ఎవరు ముందుకొస్తారో చూడాలి .