నాగార్జున భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ థియేటర్ లో సందడి చేస్తోంది. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తో తెచ్చుకొన్న నాగ్ భక్తికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఆనందంలోనే తన... నాగ్ గదిలో నిత్యామీనన్

Jyothika-Nitya

నాగార్జున భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ థియేటర్ లో సందడి చేస్తోంది. ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తో తెచ్చుకొన్న నాగ్ భక్తికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఆనందంలోనే తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు కింగ్ నాగ్.

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాజుగారి గది’ సీక్వెల్ లో నాగ్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో సరసన నిత్యామీనన్ ని ఫైనల్ చేసినట్టు సమాచారమ్. నాగ్ గదిలో సమంత కూడా ఉంది. అయితే, ఆమెది మెయిన్ రోల్ కాదట. సమంత స్పెషల్ రోల్ లో మెరవనుంది. మెయిన్ రోల్ నిత్యామీనన్ కనిపించనుంది.

నాగ్ తో జతకట్టడం నిత్యాకి ఇదే తొలిసారి. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలని మాత్రమే చేస్తూ వెళుతోంది నిత్యా. ఇప్పుడు రాజుగారి గది సీక్వెల్ లో నిత్యా చేరడంతో.. ఓంకార్ కథపై క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాని పీవీపీ నిర్మించనుంది.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్