చైతూ కోసం నిత్యా


హీరోయిన్ నిత్యామీనన్ ఓ సినిమాని ఓకే చేసిందట… అందులో మేటరు ఉన్నట్టే లెక్క. ఇప్పుడీ ముద్దుగుమ్మ నాగ చైతన్య సినిమాని ఓకే చేసిందని సమాచారమ్. ప్రస్తుతం చైతూ ‘మజిలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పెళ్లి తర్వాత చైతూ-సామ్ కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. సినిమాలోనూ వీరి భార్యభర్తలుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా తర్వాత చైతూ నటించబోయే తదిపరి సినిమా కూడా ఖరారైంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా ఉండనుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. ఇందులో హీరోయిన్ గా నిత్యామీనన్ తీసుకొన్నారంట. ఇప్పటికే ఆమె కథ చెప్పడం.. ఆమె చేయడం జరిగిపోయిందని చెబుతున్నారు. నిత్యా ఒకే చెప్పడంతో ఇది కథాబలం ఉన్న సినిమాగా చెప్పుకొంటున్నారు. మేర్లపాక గాంధీ గత చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ పాజిటివ్ టాక్ తెచ్చుకొన్న కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.