అమ్మగా నిత్యా.. ఫస్ట్ లుక్ !


హీరోయిన్ నిత్యామీనన్ అమ్మగా మారిన సంగతి తెలిసిందే. ఆమె దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ది ఐరన్ లేడి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత వర్థంతి పురస్కరించుకొని ఈరోజు జయలలితగా నిత్యా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో అచ్చం అమ్మలా ఒదిగిపోయింది నిత్యా.

వాస్తవానికి జయ పాత్ర కోసం చాలా మందినే అనుకొన్నాడు దర్శకుడు ప్రియదర్శన్. నయనతార, త్రిష్.. తదితరుల పేర్లు జయ పాత్ర కోసం వినిపించారు. చివరకు ఆ అవకాశం నిత్యాకి దక్కింది. మహానటి సావిత్రి బయోపిక్ కోసం ముందగా నిత్యానే సంప్రదించిన సంగతి తెలిసిందే. ఆమె నో చెప్పడంతో ఆ అవకాశం కీర్తి సురేష్ కి దక్కింది. మహానటి ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కీర్తి సురేష్ కీర్తిని మరింతగా పెంచేసింది. మహానటిలో సావిత్రి పాత్రని మిస్ చేసుకొన్న నిత్య.. ఎన్ టీఆర్ బయోపిక్ లో సావిత్రిలో పాత్రలో కనిపించబోతుంది.