ఆ హీరోయిన్ మసాజ్ చేసింది.. నిజమే !

nityanand

నటి రంజిత – స్వామి నిత్యానందల రాసలీలల ఏపీసోడ్ 2010లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నటి రంజిత, స్వామి నిత్యానంద సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్ చేసింది. తీరా భాగోతం బయటపడ్డాక.. ఆ వీడియోలో ఉన్నది తాము కాదని రంజిత, స్వామి నిత్యానందలు తప్పించుకొనే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చేసింది. సుదీర్ఘ కాలం శాస్త్రీయంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు… ఆ టేపులు ఎవరో క్రియేట్ చేసినవి కాదని, ఒరిజనల్ టేపులేనని నిర్ధారించారు. దీంతో.. స్వామి నిత్యానంద నటి రంజిత మసాజ్ చేసింది నిజమేనని తేలిపోయింది. దాదాపు యేడాళ్ల తర్వాత ఈ నివేదిక రావడం చూస్తుంటే.. మనదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత స్వీడుతో పని చేస్తుందో అర్థమవుతోంది.