ఆ హీరోయిన్’ని లైన్లో పెట్టిన శర్వానంద్ !

Niveda-Thomas

ముద్దుగుమ్మ నివేదా థామస్ టాలీవుడ్ లో చేసిన తొలి మూడు సినిమాలు సూపర్ హిట్టే. జెంటిల్ మెన్, నిన్నుకోరి, జై లవ కుశ హిట్స్ తో అరుదైన రికార్డుని సొంతం చేసుకొంది. ఇప్పుడీ హ్యాట్రిక్ హిట్స్ భామ కోసం దర్శక-నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న శర్వానంద్ సినిమా కోసం నివేదాని ఎంపిక చేసినట్టు సమాచారమ్.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి చోటుంది. మెయిన్ హీరోయిన్ గా నివేదాని అనుకొంటున్నారు. మరో రెండో హీరోయిన్ అవకాశం ఎవరికి దక్కుతుందన్నది చూడాలి. ఈ యేడాది శతమానం భవతి, మహానుభావుడు బ్లాక్ బస్టర్ హిట్స్ తో శర్వా జోరుమీదున్నాడు. సుధీర్ వర్మ – శర్వాల సినిమాని కూడా జెడ్ స్వీడుతో కానిచ్చేసి.. ఈ యేడాది చివర్లో లేదా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.