సమంతకి పవన్ గిఫ్ట్… అంతా బుస్

samantha-chatihu
సమంత, నాగచైతన్య వివాహ బంధంతో ఒకటయ్యారు. గోవాలో వీరిద్దరి వివాహం కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ కొత్త జంటకి రెండు డైమండ్‌ ఉంగరాలను కానుకగా పంపినట్లు ఓ వార్త వినిపించింది. ప‌వ‌న్ – త్రివిక్రమ్ స‌రిగ్గా ప్లాన్ చేసి, పెళ్లి రోజున అందేలా ఆ ఉంగ‌రాలు పంపార‌ని, అవి చూసి చై – స‌మంత షాక్ తిన్నార‌ని, ఆ ఉంగ‌రాలే మార్చుకొన్నార‌ని ఓ వార్త హాల్ చల్ చేసింది.

. అయితే ఈ న్యూస్ లో ఎలాంటి నిజం లేద‌ని తెలిసిపోయింది. అస‌లు చైత‌న్య – స‌మంత‌ల పెళ్లికి ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌లు ఎలాంటి కానుకా పంప‌లేద‌ట‌. ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్ సన్నిహితులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. అసలు అలాంటి గిఫ్ట్ ఏమీ పంపలేదని, ఇది కేవలం ఫ్యాన్స్ పుట్టించిన వార్తే అని కొట్టేపారేస్తున్నారు సన్నిహిత వర్గాలు. సమంత.. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.