ఆ టైటిల్ బాలయ్య కు కాదట..

రెండు రోజులుగా సోషల్ మీడియా లో బాలయ్య కొత్త చిత్ర టైటిల్ హడావిడి చేస్తున్న సంగతి తెల్సిందే. బాలకృష్ణ – వినాయక్ కాంబినేషన్ లో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఎకె 47’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో బాలయ్య కు అలాంటి టైటిల్ ఏంటి అని కొంతమంది అంటే, మరికొంతమంది మాత్రం బాలయ్య కు రేంజ్ కు తగినట్లు ఉందని మరికొంతమంది అన్నారు. అయితే ఈ టైటిల్ ఫై అసలైన క్లారిటీ నిర్మాత సి. కళ్యాణ్ ఇచ్చాడు.

తెలుగు ఛాంబర్ అఫ్ కామర్స్ లో ‘ఎకె 47’, అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది నిజమేనని అయితే ఈ టైటిల్ బాలకృష్ణ -వినాయక్ కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రానికి కాదని , తన బ్యానర్లో నిర్మించే తదుపరి చిత్రానికి ఆ టైటిల్ ను వాడనున్నట్లు కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ క్లారిటీ తో టైటిల్ రచ్చ తగ్గుతుందో లేదో చూడాలి.