ఎన్టీఆర్ సినిమా ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ ?

తెలంగాన ఎన్నికల ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమాపై పడినట్టు కనబడుతోంది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్ టీఆర్ జీవిత కథని రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు. తొలి భాగం ఎన్ టీఆర్ – కథానాయకుడు వచ్చే యేడాది సంక్రాంత్రి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం ఎన్టీఆర్-మహానాయకుడు ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్రబృందం.

ఈ నేపథ్యంలో ఈనెల 16న తిరుపతిలో ఎన్టీఆర్ బయోపిక్ అడియో ఫంక్షన్ ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నెల 11న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ హడావుడి, మంత్రివర్గం ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. అందులో అందరూ బిజీగా వుంటారు. అందుకే ఆడియో వేడుక విషయంలో ఈ నెల 11న నిర్ణయం తీసుకొందామని బాలయ్య సూచించారట.