ఎన్టీఆర్ హవా మొదలైంది

మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ‘ఎన్టీఆర్’ టైటిల్ తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ‘ఎన్టీఆర్’ హవా మొదలైపోయింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ డిమాండ్ పెరుగుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 12 కోట్లను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు, ఈ బయోపిక్ కోసం ముఖ్యమైన పాత్రలకిగాను నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటికే బసవతారకం పాత్రకి గాను విద్యాబాలన్ ను, నాగిరెడ్డి పాత్రకి గాను ప్రకాశ్ రాజ్ ను, బీఏ సుబ్బారావు పాత్రకి గాను సీనియర్ నరేశ్ ను ఎంపిక చేశారు. ఇదీగాక, ఈ చిత్రంలో మహేష్ బాబు, నాగచైతన్య, రానా దగ్గుపాటి, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్.. తదితరులు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ఎన్ టీఆర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చేయను