చంద్రబాబుగా రానా ఫస్ట్‌లుక్‌

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్‌టీఆర్‌’ బయోపిక్‌లో రానా.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలో చంద్రబాబుగా రానా లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1984లో చంద్రబాబు లుక్‌ ఇలా ఉండేది అంటూ రానా ట్విటర్‌ ద్వారా దీనిని విడుదల చేశారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ నటిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. ఇక, సావిత్రిగా కీర్తి సురేష్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్, హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. వచ్చే యేడాది సంక్రాంటి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.