అభిమానులని నిరాశపరిచిన తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులని నిరాశపరిచే నిర్ణయం తీసుకొన్నారు. కానీ, తప్పదు. ఈ నెల 20న తారక్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్. ఇంతలో ఈ యేడాది పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకోవడం లేదని తారక్ బాంబు పేల్చాడు. గత యేడాది ఆగస్టులో నందమూరి హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంకా యేడాది పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్ దూరంగా ఉండబోతున్నారు. ఇది ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూసే. కానీ, అర్థం చేసుకొంటారు.

ప్రస్తుతం తారక్ రామ్‌చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తున్నారు. తారక్ బర్త్ డే కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుంచి బర్త్ డే గిఫ్ట్ రావొచ్చు. కొమరంభీమ్ గా తారక్ ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక,ఈ సినిమాలో తారక్ కి జంటగా ఎవరు నటిస్తున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.