ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్.. టు యూరప్ !

NTRFAMILY

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వేయబోతున్నట్టు ముందే తెలిసిన విషయం. ఇప్పుడా ఫారిన్ ట్రిప్ అప్ డేట్స్ కూడా వచ్చేశాయ్. ఈ నెల 20న తారక్ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అక్కడ ఎన్నిరోజులు గడుపుతారు ? ఎప్పుడు తిరిగొస్తారు.. ?? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

కొన్నాళ్ల క్రితం వరకు జై లవ కుశ, బిగ్ బాస్ తెలుగు షోతో తారక్ బిజీ బిజీగా గడిపేశారు. ఈ రెండింటిని విజయంతగా ముగించేసి.. ఆ హిట్ కిక్కుని కూడా ఎంజాయ్ చేసిన తారక్ కొన్నాళ్లపాటు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ లో సేదతీరనున్నారు. పైగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలవ్వబోయే తారక్ తదుపరి సినిమా మొదలవ్వడానికి ఇంకా మూడు నెలల సమయం కూడా ఉంది. ఈ లోపు యూరప్ లో ఉంటూ ఫుల్ టైం ఫ్యామిలీతో గడుపుతూ.. త్రివిక్రమ్ సినిమా కోసం కొత్త లుక్ ని ట్రై చేసే పనిలో ఉంటాడట.

మొత్తానికి.. మరో మూడు నెలల పాటు తారక్ కనిపించకపోవచ్చు. అప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు, బోర్ కొడితే యూట్యూబ్ లో బిగ్ బాస్ సీజన్ – 1 ని చూసేయడమే.. ఎన్ టీఆర్ అభిమానులకు మిగిలింది.