ఎన్టీఆర్ కష్టం మాములుగా లేదు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకం గా రూపుదిద్దుకోబోతోంది. చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫిట్‌గా తయారు కావడానికి కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన జిమ్‌లో చాలా కష్టపడుతున్నారు. తారక్‌ వ్యాయామం చేస్తుండగా తీసిన వీడియోను ఇటీవల ఆయన ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. కాగా తాజాగా ఆయన మరో ఫొటోను పోస్ట్‌ చేశారు. తారక్‌ చాలా పట్టుదలతో కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కాబోతోంది.