‘శక్తి’ని ఎలా మర్చిపోతాను : తారక్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రం శక్తి. ఈ సినిమా గురించి ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ప్రస్తావించారు.
‘మగధీర’ తర్వాత చరణ్‌ హిస్టారికల్‌ ఫాంటసీ నేపథ్యం ఉన్న సినిమా చేయలేదు. తారక్‌ కూడా ‘యమదొంగ’ తర్వాత అలాంటి సినిమా చేయలేదని ఓ మీడియా ప్రతినిధి అంటుండగా.. తారక్ జోక్యం చేసుకొన్నారు. భలేవారండీ శక్తి మర్చిపోయారా…మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోనునని నవ్వేసారు తారక్.

ఇక, నాలుగోసారి జక్కన్నతో సినిమా చేస్తున్నా. ఈసారి ప్రాణ స్నేహితుడైన చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాని రాజమౌళి కాకుండా ఇంకో దర్శకుడు తీసుకువస్తే మీరిద్దరూ చేసేవారా అనే ప్రశ్నకు
కూడా ఎదురైంది. దీనికి తారక్ సమాధానమిస్తూ.. రాజమౌళి కాబట్టి ఇది జరిగింది. భవిష్యత్తులో మరేదైనా కథతో మమ్మల్ని సంప్రదిస్తే, జరుగుతుందో లేదో చెప్పలేనునన్నారు.