ఎన్టీఆర్- త్రివిక్రమ్.. ఓ ట్విస్ట్

ntr
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో బిజీ గా వున్న త్రివిక్రమ్.. ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న తొలి సినిమా ఇది. దీంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఇపుడీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళేలోగా మరో సినిమాని చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. . త్రివిక్రమ్ -పవన్ సినిమా ఈ సంక్రాంతికి విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత‌.. ఎన్టీఆర్ స్క్రిప్టు మొద‌లై, పూర్త‌య్యే స‌రికి మ‌రో మూడు నెల‌లైనా ప‌డుతుంది. ఈలోగా ఖాళీగా ఉండ‌డం ఎందుక‌న్న‌ది ఎన్టీఆర్ ఆలోచ‌న‌. అందుకే ఈ గ్యాప్ లో ఓ సినిమా పూర్తి చేద్దామ‌నుకొంటున్న‌ట్టు టాక్‌. అందుకోసం ఇటీవ‌ల దిల్‌రాజుతోనూ ఎన్టీఆర్ సంప్ర‌దింపులు జ‌రిపాడ‌ని తెలుస్తోంది.