చరణ్ షూటింగ్’లో, ఎన్టీఆర్ జిమ్ లో !


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ లో తారక్, చరణ్ ఇద్దరూ పాల్గొన్నారు. వీరిపై ఓ యాక్షన్ ఏపీసోడ్ ని చిత్రీకరించారు జక్కన్న. ఐతే, రెండో షెడ్యూల్ లో మాత్రం రామ్ చరణ్ మాత్రమే పాల్గొన్నారు. చరణ్ పై ఫైట్ సీన్ ని చిత్రీకరించారు. ఐతే, తారక్ ఏం చేస్తున్నట్టు. ఆయన ఖాళీగా ఏం లేడు.

ఆర్ఆర్ఆర్ కోసం తారక్ శిక్షణ మొదలెట్టాడు. పాత్ర కోసం బాడీ బిల్డ్అప్ చేస్తున్నాడు. వ్యక్తిగత ట్రైనర్ లాయిడ్ స్టీఫెన్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్కవుట్స్ చేస్తున్నాడు. దాదాపు నెలరోజుల పాటు శిక్షణ తీసుకోనున్నాడు. ఆ తర్వాత మూడో షెడ్యూల్ లో మొత్తం తారక్ పై నే ఉండబోతుంది. ఆ సమయంలో చరణ్ శిక్షణ తీసుకోనున్నాడని తెలుస్తోంది.

దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా హీరోయిన్స్, ఇతర నటీనటులు ఖరారు కాలేదు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.