‘ఆఫీసర్’ పై క్లారిటీ వచ్చింది


రామ్‌గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘ఆఫీసర్’. సుమారు 25 సంవత్సరాల తరవాత మళ్లీ ఈ ఇద్దరు స్టార్లు కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే రూమర్లు కూడా బాగా హల్ చల్ చేస్తున్నాయి ఈ సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్ని.. ఆ సినిమా నిర్మాతలు తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశారు.

ఆఫీసర్ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ, ఏకంగా 13కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టు వార్తలొచ్చాయి. అటు శాటిలైట్ రైట్స్ కూడా ఏకంగా 6కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ రెండు వార్తల్లో నిజంలేదని స్పష్టం చేస్తూ.. అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు “కంపెనీ” ప్రొడక్షన్స్ సీఈవో సుధీర్ చంద్ర. ఈ చిత్రాన్ని కంపెనీ ప్రొడక్షన్‌పై రాంగోపాల్ వర్మ, సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు.