నాగార్జున – రాఘవేంద్ర రావుల కలయికలో తెరకెక్కిన మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా టైటిల్ పై... వివాదంలో.. ‘ఓం నమో వెంకటేశాయ’ !

omnamo
నాగార్జున – రాఘవేంద్ర రావుల కలయికలో తెరకెక్కిన మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా టైటిల్ పై వివాదం తలెత్తింది. బంజారా సంఘాలు ఈ చిత్ర టైటిల్ ని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

‘ఓం నమో వెంకటేశాయ’.. శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు హాథిరామ్ బాబా జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. భక్తుడు హాథిరామ్ బంజారా కులస్థుడు. దీంతో. చిత్ర టైటిల్ ని ‘హథీరామ్‌ బాబా’గా మార్చాలని బంజారా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం ఓ లాజిక్ ని కూడా చెబుతున్నారు.

గతంలో నాగార్జున – రాఘావేంద్ర రావు కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన సినిమాకి ‘అన్నమయ్య’ టైటిల్ ని పెట్టారు. శ్రీభక్త రామదాసు జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన సినిమాకి ‘శ్రీరామదాసు’ టైటిల్ ని పెట్టారు. హాథిరామ్ బాబా జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి హాథిరామ్ బాబా గా పెట్టాలన్నది వారి డిమాండ్.

మరోవైపు, టైటిల్ వివాదాన్ని చిత్రబృందం లైట్ గా తీసుకొన్నట్టు తెలుస్తోంది. పసలేని డిమాండ్ లని పట్టించుకోవాల్సిన పనిలేదని చిత్రబృందం అంటోంది. ఇక, ఈ చిత్రంలో నాగ్ సరసన అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి. ఎ. మహేష్ రెడ్డి నిర్మాత.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్