omnamo

భక్తిరస చిత్రాలకి కెరాఫ్ గా నిలిచారు నాగార్జున. ఇప్పటికే నాగార్జున – రాఘవేంద్ర రావు కలయికలో అన్నమయ్య, శ్రీరామదాసు, శిర్డి సాయిబాబా లాంటి భక్తిరస చిత్రాలొచ్చాయి. ఇపుడు వీరి కలయికలో వస్తున్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. తిరుమల వెంకటేశ్వరుడి పరమ భక్తుడు హథీరాం బావాజీ కథతో తెరకెక్కిన చిత్రమిది.

పూర్తిగా భక్తుడి కోణంలో నుంచి చెప్పిన కథ ‘అన్నమయ్య’. అయితే, ‘ఓం నమో వెంకటేశాయ’లో వెంకటేశ్వరస్వామితో భక్తుడి స్నేహం అన్న కొత్త కోణం చూపించబోతున్నారు. ఎమోషన్ పరంగా ఈ రెండూ సినిమాలు భిన్నమైనవని చెబుతున్నాడు దర్శకేంద్రుడు. ఇందులో నాగార్జున హాథిరామ్ బాబాగా కనిపించబోతున్నాడు. నాగ్ సరసన అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ లు జతకట్టనున్నారు. జగపతిబాబు మండలాధీశుడిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం కీరవాణి. ఎ. మహేష్ రెడ్డి నిర్మాత. భారీ అంచనాల మధ్య ఈ భక్తిరస చిత్రం రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఓం నమో వెంకటేశాయ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

ప్రివ్యూ :
* నాగార్జున – రాఘవేంద్ర రావుల కలయికనే చాలా గొప్పది

* అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డిసాయిబాబా లాంటి గొప్ప భక్తిరస చిత్రాలని అందించిన కలయిక ఇది.

* వీరి కలయికలో వస్తోన్న మరో భక్తిరస చిత్రం ఓం నమోవెంకటేశాయ

* ‘అన్నమయ్య’ సినిమాలో అద్భుతమైన క్లైమాక్స్ కుదిరిందని చెబుతుంటారు.

* ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ క్లైమాక్స్ అన్నమయ్యని మించి ఉంటుందని చెబుతున్నారు.

* భక్తుడంటే అందరికీ నాగార్జునే గుర్తొస్తారు. ఈ చిత్రంలో హాథిరామ్ బాబాగా నాగ్ నటన అద్భుతం అంటున్నారు చిత్రబృందం

* నాగార్జున లేకుంటే ఈ సినిమా చేసివాడు కాదట దర్శకేంద్రుడు

* రాఘవేంద్రరావు కెరీర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలువనుందని చెబుతున్నారు

ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్ పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.

లేటెస్ట్ గాసిప్స్