అమ్మాయి కన్నుకొడుతున్న సీన్ సూపర్ హిట్

తమిళంలో ‘ఒరు అదర్ లవ్’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా, ఈ సినిమా నుంచి రిలీజైన ఓ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రియ ప్రకాశ్‌ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా నుంచి ‘మాణిక్య మలరయ పూవి .. ‘ అనే పాటని రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో ప్రియ హైస్కూల్‌ విద్యార్థినిగా నటిస్తోంది. పక్కనే నిలబడిన తన ప్రియుడిని చూసి ప్రియ కన్ను కొడుతున్న సన్నివేశం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రేమికుల రోజు రాబోతున్న సందర్భంగా ఈ అమ్మాయి కన్నుకొడుతున్న సన్నివేశాన్ని ఉపయోగించుకొని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ పాటను ఒక్కరోజులో 40 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోని మీరు ఓ సారి చూసేయండీ.. !

Attachments area