రెండో ‘పందెకోడి’కి పది కోట్లు

‘పందెంకోడి’గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు విశాల్. తెలుగు, తమిళ్ ల ప్రేక్షకులని పందెం కోడి మెప్పించింది. ఇన్నాళ్లు ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్-కీర్తి సురేష్ జంటగా రెండో పందెం కోడి తెరకెక్కుతోంది. ఇప్పటికే తెలుగు పందెం కోడి 2 అమ్ముడుపోయినట్టు సమాచారమ్.

ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను ‘ఠాగూర్’ మధు తీసుకున్నారు. శాటిలైట్ హక్కులు. తెలుగు వెర్షన్ హక్కులను కలుపుకుని రూ. 10 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారమ్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విశాల్ ‘అభిమన్యుడు’ సూపర్ హిట్ అయ్యింది.

ఇదీగాక, తారక్ ‘టెంపర్’ తమిళ్ రిమేక్ లో విశాల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టనున్నారు.