సీనియర్ నటి పార్వతీ ఘోష్ ఇకలేరు

ఒరియా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఒరియా సినీ ఇండస్ట్రీలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన సీనియర్ నటి పార్వతీ ఘోష్ (85) కన్నుమూశారు.
భువనేశ్వర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు.

పార్వతీ ఘోష్ మార్చి 28, 1933లోకటక్‌లో జన్మించారు.16 యేళ్ల వయసులో ‘శ్రీ జగన్నాథ్’ అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యరు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారామె. పార్వతీ ఘోష్ మృతిపట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భువనేశ్వర్‌లోని ఆమె నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు వచ్చాక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.