చిత్రలహరిపై పవన్ కామెంట్స్


ఇన్నాళ్లు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఆయనకి విశ్రాంత్రి దొరికింది. దీంతో.. పవన్ కుటుంబ సభ్యులతో కలిసి ‘చిత్రలహరి’ సినిమా చూశారు. పవన్ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన షోకు పవన్ తో పాటు సాయి తేజ్ కుటుంబ సభ్యులు అంతా వచ్చినట్లు తెలుస్తోంది.

చిత్రలహరిని పవన్ బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫెయిల్యూర్ స్టోరీ పవన్ కు బాగా నచ్చినట్లు సమాచారం. అంతేకాదు తన కెరియర్ కు ‘ఖుషీ’ ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో అలాంటి బ్రేక్ తేజ్ కు ‘చిత్రలహరి’ ఇస్తుంది అని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కిషోర్ తిరుమల పై పవన్ ప్రశంసలు కురిపించారని తెలిసింది.