కాటమరాయుడు మళ్ళీ యాక్షన్ లోకి దిగాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు . శ్రుతి హాసన్ హీరోయిన్. ఇటీవల పవన్‌ అమెరికా పర్యటనకు వెళ్లడంతో షూటింగ్ కు బ్రేక్... పవన్ మళ్ళీ యాక్షన్ లోకి దిగాడు

pawan kalyan

కాటమరాయుడు మళ్ళీ యాక్షన్ లోకి దిగాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు . శ్రుతి హాసన్ హీరోయిన్. ఇటీవల పవన్‌ అమెరికా పర్యటనకు వెళ్లడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.అయితే ఇప్పుడు పవన్‌ అమెరికా నుంచి తిరిగి రావడంతో మళ్లీ ‘కాటమరాయుడు’జోరందు అందుకుంది. పవన్‌పై తీసే ముఖ్య సన్నివేశాలను దర్శకుడు మళ్లీ మొదలు పెట్టాడు.

ప్రస్తుతం ఈ సినిమా సంబధించి రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు చిత్రీకరణ పూర్తయింది. కిషోర్‌ కుమార్‌ పార్థసాని డాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. ఇటివలే రిలీజైన ఈ చిత్రం టీజర్ సంచలనం రేపింది. శరత్ మారార్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. మార్చి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. .

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్