నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా రేపు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు, ఏపీ ప్రభుత్వం... కోర్టుకెక్కిన ‘శాతకర్ణి’

gouthami
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. సంక్రాంతి కానుకగా రేపు (గురువారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు, ఏపీ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడీ చిత్రంపై ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను రద్దు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చిత్రంలో చరిత్రను వక్రీకరించారా.. ? సరిగ్గా చూపించారా..? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా పన్ను మినహాయింపును ఎలా ఇస్తారని పిటిషనర్ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా బావమరిది బాలయ్య కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అదనపు సహాయంగా ఆరోపిస్తున్నారు. అయితే, ఈ పిటిషన్ ని తక్షణం విచారించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి రాజకీయ రంగు అంటుకొనేలా కనిపిస్తోంది. శాతకర్ణి తెలుగు ప్రేక్షకులని, చరిత్రాకారులని మెప్పిస్తే సరేసరి. లేకపోతే.. శాతకర్ణిని ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షాలు వినియోగించుకొన్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరీ.. బాలయ్య ప్రతిపక్షాలకి ఆ అవకాశం ఇస్తాడా. ? లేదా.. ?? చూడాలి.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బాలయ్య సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనుంది. ఈ చిత్రానికి సంగీతం చిరంతన్ భట్.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్