ఎన్టీఆర్ బయోపిక్.. అప్పుడే లీకులు !

మహానటుడు ‘ఎన్టీఆర్ బయోపిక్’ స్టార్స్ తో నిండిపోతుంది. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తండ్రి ఎన్ టీఆర్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు. ఎన్ టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నాదెండ్ల బాస్కర్ రావు పాత్రలో బాలీవుడ్ నటుడు సచిన్ కేడ్కర్, చంద్రబాబు పాత్రలో రానా దగ్గుపాటి కనిపించబోతున్నారు.

వీరితో పాటు మోహన్ బాబు, మహేష్ బాబు, సుమంత్, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, అనసూయ తదితరులు కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఎన్ టీఆర్ బయోపిక్ అప్పుడే లీకుల సమస్య మొదలైంది. శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న బాలయ్య పిక్ సెట్స్ నుంచి లీకైంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి. బాలకృష్ణ, సాయికొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాతలు.