ముందుగా ప్రధాని సినిమాని చూడండీ.. !


ఎన్నికల వేళ పొలిటికల్ బయోపిక్ ల విడుదలకి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ప్రధాని నరేంద్రమోడీ బయోపిక్ “పిఎం నరేంద్ర మోడీ” కూడా ఉంది. ఏప్రిల్ 11 విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఈసీ బ్రేక్ వేసింది. ఇప్పుడీ సినిమా నిర్మాతలు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ట్రైలర్ ని మాత్రమే చూసి సినిమా విడుదలని ఎలా అడ్డుకొంటారని నిర్మాతలు వాదించారు.

సినిమా మొత్తం చూసి.. అప్పుడు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సినిమా చూసిన తరువాత ఓటర్లను ప్రభావితం చేస్తుందో లేదో చెప్పాలని నిర్మాతలు సుప్రీంకు విన్నవించారు. నిర్మాతలతో ఏకీభవించిన సుప్రీం కోర్ట్… ఈసీ ఈ సినిమా మొత్తం చూసి తరువాత నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని సినిమాని చూసీ ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.