బాహుబలితో పూజా హెగ్డే రొమాన్స్


పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ స్టార్. గత ఏడాది దువ్వడా జగన్నాథమ్ సినిమాతో హిట్ కొట్టింది. ఈ సినిమా యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో పెద్ద ప్రొడక్షన్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ – మహేష్ బాబు సినిమాల్లో ఆవకాశం అందుకున్న పూజ త్వరలో బాహుబలి స్టార్ తో జత కట్టనుందట.

ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత జిల్ దర్శకుడు రాధాకృష్ణతో ఒక రొమాంటిక్ ఎంటర్టైన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం దర్శకుడు హీరోయిన్ ని ఫైనల్ చేశాడు. ఈ విషయాన్ని పూజనే ఖారారు చేసింది.