తెలుగు స్టార్స్ లో అదెక్కువట.. !


టాలీవుడ్ లో హీరోయిన్ పూజా హెగ్డే హవా సాగుతోంది. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతోంది. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, మహేష్‌, చరణ్‌, ప్రభాస్.. సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు స్టార్స్ లోని ఓ ఉమ్మడి లక్షణం గురించి చెప్పింది పూజా. తెలుగు స్టార్స్ లో హాస్యచతురత బాగుంటుంది.సెట్లో చాలా సరదాగా ఉంటారు. నన్ను నవ్విస్తుంటారని తెలిపింది. బహుశా.. తెలుగువాళ్లలో సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువనుకుంటానని తెలిపింది.

ప్రస్తుతం పూజా.. మహేష్ మహర్షి, ప్రభాస్ ‘జాన్’ (ఇంకా ఫైనల్ కాలేదు) చిత్రాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాలు తనకి మంచి పేరుని తీసుకొస్తాయని ఆశపడుతోంది. మరోవైపు, బాలీవుడ్ కు టచ్ లోనే ఉంది పూజా. అక్కడ మంచి కథ కోసం వెయిట్ చేస్తోంది.