ఆ ఇద్దరినీ వేధించింది ఒక్కడే.. !

తనని సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నారంటూ హీరోయిన్ పూనం కౌర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకి మరో లింకు దొరికింది. వైకాపా నేత లక్ష్మీపార్వతి ని వేధిస్తున్నది , పూనమ్ ని వేధిస్తున్నది ఒక్కడేనని గుర్తించారు.

కొందరు వ్యక్తులు తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో వాళ్లు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు.