యూట్యూబ్ ఛానల్స్ ఫై పూనమ్ పిర్యాదు..

ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్..తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. గత కొంత కాలంగా యూట్యూబ్ ద్వారా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, సదరు యూట్యూబ్ చానల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిర్యాదు చేసింది.

కొంతమంది వ్యక్తులు తనను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని..వారు పెట్టిన లింకులను పోలీసులకు తెలిపింది. వెంటనే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. గత రెండేళ్లుగా తన పేరుతో కొంతమంది యూట్యూబ్ లో వీడియో లింకులు పెడుతూ తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని తన పిటిషన్లో పేర్కొంది. సుమారు 50 యూట్యూబ్ చానల్స్ పై నటి పూనమ్ కౌర్ ఫిర్యాదు చేసింది.