posani (2)

పోసాని కృష్ణ మురళి తెలుసా అని అడిగితే..ఎవరైనా ఆ మెంటల్ కృష్ణ నా ఎందుకు తెలియదు అనే సమాధానం చెపుతారు..అంత పాపులర్ ఈయన. సినిమాల్లోనే కాదు బయటకు కూడా చాల డిఫరెంట్. ముక్కు సూటిగా మాట్లాడే తత్త్వం..కోపం వస్తే చాలు ఎదురుగా ముఖ్యమంత్రి ఉన్న సరే ఏకిపారేస్తాడు..ఆ మధ్య చిరంజీవి , పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలను సైతం వదిలిపెట్టలేదు. ఈ మధ్య రాజకీయ వేత్త అయినా వి. హనుమంతరావు ని లైవ్ లో కొట్టేంత పని చేసాడు. అటువంటి పోసాని తాజాగా ఓ మీడియా లో ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ ను బండ బూతులు తిట్టాడు.

koratala (2)
వరుసకు కొరటాల శివ మేనల్లుడే కదా అలాంటి అతడితో మీరు ఎందుకు గొడవ పడ్డారు..అసలు గొడవ ఎందుకు వచ్చిందని సదరు యాంకర్ ప్రశ్నించగా..ఇది జరిగి చాలా రోజులైందని.. అవును గొడవ జరిగింది అంటూ అంతెత్తున లేచారు పోసాని. ‘వాడు నా మేనళ్లుడే.. అయినా తప్పుగా మాట్లాలితే క్షమించాలా.. నేను వాడి సినిమాల్లో క్యారెక్టర్ ఇవ్వమంటూ పదే పదే ఫోన్‌లు చేస్తున్నానని.. విసిగిస్తున్నానని ఓ పెద్దాయన దగ్గర వాగాడట.. దానికి ఆ పెద్దాయన అదేంటి పోసాని చాలా బిజీ ఆర్టిస్ట్ వేశాలకోసం నిన్ను అడగటం ఏంటని అని బదులిచ్చారు. ఆ పెద్దాయన ద్వారా విషయం తెలుకున్న నేను శివని అడిగా .. తిట్టా.. పోపడ్డా.. నువ్ వేశాలు నాకు ఇవ్వాలా అంటూ క్లాస్ పీకానని ..జరిగింది చెప్పాడు.

ఎన్నో టాప్ చిత్రాలకు డైలాగ్స్ , కథలు , స్క్రీన్ ప్లే అందించాడు పోసాని , ప్రస్తుతం టాప్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు.

లేటెస్ట్ గాసిప్స్