చైతూ.. అప్పుడు బొమ్మ.. ఇప్పుడు దానమ్మ !


నాగచైతన్య-సమంతల ‘మజిలీ’ సూపర్ హిట్ అయ్యింది. ఏకంగా రూ. 50కోట్లు కలెక్ట్ చేసింది. చైతూ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ఇవి. బ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మంగళవారం ఈ సినిమా థాంక్స్ మీట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి కొరటాల శివ, అనిల్ రావిపూడి గెస్టులుగా హాజరయ్యారు.

ఈ సంర్భంగా పోసాని కృష్ణ మురళిమాట్లాడుతూ.. నాగ చైతన్య తొలి చిత్రం జోష్ చూసినపుడు బొమ్మలా అనిపించాడు. కానీ ఈ సినిమాలో దానమ్మలా ఉన్నాడు. దేవదాసు చూశాక తాగుబోతు పాత్రలో ఎవరిని చూసినా నచ్చేది కాదు. కృష్ణుడి పాత్ర రామరావు వేస్తే మిగతా వారిని ఆ పాత్రలో ఎలా చూడలేమో. తాగుబోతు పాత్ర నాగేశ్వరరావు తప్ప.. వేవారు వేస్తే చూడలేం. కానీ నాగార్జున మజ్నులో వాళ్ల నాన్నలా కాకుండా తన ఫిజికల్ అడ్వాంటేజ్‌కి తగిన విధంగా చేసి సక్సెస్ అయ్యాడు. ఇపుడు నాగ చైతన్య కూడా తన స్టైల్‌లో చేశాడు” అన్నారు.