నిక్కీగల్రాణిని పెళ్లాడిన ప్రభుదేవా.. !!

prabhudeva

ప్రభుదేవా – నయనతారల లవ్ ఎఫైర్ గురించి తీసింది. వీరి ప్రేమ పెళ్లి పీఠలు దాక వెళ్లి ఆగిపోయింది. అయితే, ఇప్పుడు హీరోయిన్ నిక్కీగల్రాణిలతో ప్రభుదేవా వివాహం జరగనుందట. తిరుపతిలో వీరి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే, ఇది రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. ప్రభుదేవా ‘చార్లీచాప్లిన్‌’కు స్వీకెల్‌గా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ప్రభుదేవా సరసన నిక్కీగల్రాణి, ఆదాశర్మలు జతకట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది. నిక్కీగల్రాణీతో ప్రభుదేవా పెళ్లి సీన్ ని తెరకెక్కించబోతున్నారు. ఇది తెలిసి నిజంగానే నిక్కీగల్రాణీని ప్రభుదేవా పెళ్లాడబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి శక్తి చిదంబరం దర్శకుడు. టి. శివ నిర్మాత.