దర్బార్ విలన్ ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ – మురుగదాస్ కలయికలో దర్బార్ అనే మూవీ మొదలైన సంగతి తెలిసిందే. ముంబై లో ఓ భారీ సెట్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టుకుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ యంగ్ యాక్టర్ ప్రతీక్ బబ్బర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

మురగదాస్ తన సినిమాల్లో బాలీవుడ్ నటులను విలన్ గా తీసుకోవడం ఇది మూడవ సారి. ఇంతకుముందు విద్యుత్ జమ్మవాల్ ను తుపాకి లో విలన్ గా తీసుకోగా నిల్ నితిన్ ముఖేష్ ,కత్తి లో విలన్ గా తీసుకోవడం జరిగింది. మరి బాలీవుడ్ యాక్టర్స్ కలిసొస్తున్నారని తీసుకుంటున్నారో..లేక హీరో రేంజ్ బట్టి అంతే విలన్ గా ఉండాలని వారిని తీసుకుంటున్నారో తెలియదు కానీ..తన ప్రతి సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ విలన్ గా చేయడం చర్చగా మారింది.

ఈ చిత్రంలో రజనీకి జోడిగా నయనతార నటిస్తుండగా..అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.