చిన్మయిని బెదిరించిన నిర్మాత


దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ప్రారంభించింది సింగర్ చిన్మయి శ్రీపాద. ప్రముఖ రచయిత వైరముత్తు లైంగిక వేధించినట్టు ఆరోపించింది. డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ ప్రసిడెంట్ రాధారవిపై కూడా ఇలాంటి ఆరోపణలో చేసింది. అదే సమయంలో ఆమెకు కౌంటర్ గా విమర్శలు, ఆరోపణలు, బెదిరింపులు వస్తున్నాయి.

తాజాగా చిన్మయిని ఓ నిర్మాత బెదిరించాడు. అది కూడా బహిరంగంగా స్టేజి పై నుంచి. నిర్మాత కే.రాజన్‌ ఇటీవల జరిగిన ఒక తమిళ చిత్ర ఆడియో లాంచ్ వేదికపై ఒక గాయని ప్రముఖ రచయిత వైరముత్తు పై మీటూ ఆరోపణలు చేసింది. ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును, గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసింది. ఆమె ఇదే విధంగా దుష్ప్రచారం చేసుకుంటూ పోతే, తాను ఆ గాయని పని పట్టడానికి కొందరిని సిద్ధం చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు.