ఎన్టీఆర్ – పూరి కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘టెంపర్’. సూపర్ హిట్టయ్యింది. ఇందులో ఎన్టీఆర్, పోసాని నటన అద్భుతం. ఇందులో పోసాని కృష్ణమూర్తి పోషించిన హెడ్ కానిస్టేబుల్ పాత్ర కోసం ముందుగా... ‘టెంపర్’ ఎందుకు రిజక్ట్ చేశావ్ మూర్తి ?

narayana-murthi
ఎన్టీఆర్ – పూరి కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘టెంపర్’. సూపర్ హిట్టయ్యింది. ఇందులో ఎన్టీఆర్, పోసాని నటన అద్భుతం. ఇందులో పోసాని కృష్ణమూర్తి పోషించిన హెడ్ కానిస్టేబుల్ పాత్ర కోసం ముందుగా ఆర్. నారాయణ మూర్తి అడిగామని, ఆయన రిజక్ట్ చేయడంతో ఆ పాత్రలో పోసానిని తీసుకొన్నట్టు అప్పట్లో స్వయంగా దర్శకుడు పూరినే తెలిపారు.

తాజాగా, ‘టెంపర్’ లో హెడ్ కానిస్టేబుల్ పాత్రని రిజక్ట్ చేసినందుకు గల రీజన్ ని చెప్పాడు ఆర్. నారాయణ మూర్తి. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా చేసిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆర్. నారాయణ మూర్తి.. టెంపర్ లో హెడ్ కానిస్టేబుల్ పాత్ర కోసం పూరి తనని సంప్రదించిన మాట వాస్తవమే.

ఇన్నాళ్లు కష్టపడి కథానాయకుడిగా ఎదిగాను. ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం ఇష్టం లేకని టెంపర్ ఆఫర్ ని వదులుకొన్నట్టు తెలిపారు నారాయణ మూర్తి. తనని అర్థం చేసుకొన్న దర్శకుడు పూరి, ఎన్ టీఆర్ లకి కృతజ్ఝతలు తెలిపారు.

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్