ఆ హీరోయిన్’ని గదిలోకి పిలిచిన నిర్మాత.. ఎవరు ?

radhika

సినీ పరిశ్రమలో హీరోయిన్స్’కు పడకగది పిలుపులపై కొద్దిరోజుల క్రితం వరకు హాట్ హాటు చర్చ జరిగింది. పగడకగది పిలుపులు ఎదుర్కొన్నామని కొందరు సీనియర్, యంగ్ హీరోయిన్స్ ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం నార్త్ లోనే ఎక్కువగా ఉందనే అభిప్రాయం చర్చల్లో తేలింది. ఇప్పుడు సద్దుమణిగిన ఈ వ్యవహారాన్ని మళ్లీ కెలికింది హాట్ బ్యూటీ రాధికా ఆప్టే. దక్షిణాది సిని పరిశ్రమలో హీరోయిన్లను పడక గదికి రమ్మని ఒత్తిడి చేసే సంప్రదాయం ఉందని ఆమె కామెంట్ చేసింది.

అక్కడితో ఆగకుండా తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కథా చర్చలకు పిలిచిన ఓ నిర్మాత తనను పడక గదికి రావాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయితే, తాను అంగీకరించలేదని తెలిపింది. ఈ కారణం వల్లే తనకు దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సౌత్’లో రాధికని వాడుకోవాలని చూసిన ఆ బడా నిర్మాత ఎవరు ? అనే విషయంపై హాట్ హాట్ చర్చకు తెరలేసింది.

బాలీవుడ్ చిత్రాల్లో అర్ధనగ్న దృశ్యాల్లో నటిస్తూ బోల్డ్ యాక్ట్రెస్ గా తెచ్చుకొన్న రాధిక ఆఫ్టే తెలుగులో బాలయ్యతో రెండు సినిమాలు, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’లో నటించింది.