ఆమీర్’తో రెండు.. రణ్ బీర్ తో ఐదు !

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణీ ది ప్రత్యేక శైలి. ఆయన చేసినవి ఆరే సినిమాలు. అందుకొన్న అవార్డులు మాత్రం బోలేడు. మున్నాభాయ్ ఎం.బి.బీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రి-ఇడియట్స్, పీకే, సాలాఖడూస్, సంజు.. వీటిలో దేనికదే ప్రత్యేకం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సంజు’ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

ఇప్పుడీ దర్శకుడు రణ్ బీర్ సింగ్ తో ఐదు సినిమాలు చేస్తానని మాటిచ్చాడట. సంజు ప్రమోషన్స్ పాల్గొన్న రాజ్ కుమార్ ని.. ఆమీర్ తో రెండు సినిమాలు చేశారు. మరీ.. తనతో ఎన్ని సినిమాలు చేస్తారని అడిగాడట రణ్ వీర్. దానికి నీతో ఐదు సినిమాలు చేస్తానని చెప్పాడట హిరానీ. ఈ హామీతో రణ్ బీర్ ఖుషి అయిపోతున్నాడు. సంజు లో సంజయ్ పాత్రలో రణ్ బీర్ ఒదిగిపోయిన విధానానికి హిరానీ ఫిదా అయిపోయాడు.నిజంగానే హిరానీ రణ్ బీర్ తో ఐదు సినిమాలు చేస్తే.. ఇక ఈ యంగ్ హీరోకు తిరుగుండదు.