#ఆర్ఆర్ఆర్’లో విలన్’గా కన్నడ హీరో.. ఇదిగో రుజువు !


రాజమౌళి మల్టీస్టారర్ #ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్)లో కన్నడ హీరో యశ్ నటించబోతున్నాడు. ఆయనది సినిమాలో విలన్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. యశ్ ని కన్నడ ప్రజలు జూనియర్ ప్రభాస్ గా పిలుస్తుంటారు. ఆయన తాజా చిత్రం ‘కేజీఎఫ్’ కూడా ప్రభాస్ ‘ఛత్రపతి’ని పోలీ వుంటుందట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ కిరంగదూర్ నిర్మాత. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ని ఈ నెల 9న హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు.

హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ‘కేజీఎఫ్’ ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్టు సమాచారమ్. #ఆర్ఆర్ఆర్ యశ్ విలన్ గా కనిపించబోతున్న నేపథ్యంలో ఆయన్ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయడం కోసమే ‘కేజీఎఫ్’ ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టు చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే.. #ఆర్ఆర్ఆర్ యశ్ విలన్ గా కనిపించడం ఫిక్స్ అన్నమాట.

ఇక, ఎన్ టీఆర్ , రామ్ చరణ్ లు కథానాయకులుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్స్ ఎవరు అన్నది ఇంకా తెలియలేదు. ఈ నెల 12న మధ్యాహ్నం 12గంటలకు ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్స్ పై జక్కన్న ప్రకటన చేస్తారని చెబుతున్నారు.