‘తొలిప్రేమ’పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

వరుణ్ తేజ్-రాశీఖన్నాల ‘తొలిప్రేమ’పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా, దర్శకధీరుడు రాజమౌళి ‘తొలిప్రేమ’ని ప్రశంసించారు. ‘తాను ప్రేమ కథలను పెద్దగా అభిమానించే వాడిని కాకపోయినప్పటికీ, ‘తొలిప్రేమ’ సినిమాని చూసి మాత్రం ఎంజాయ్ చేశాను. దర్శకుడు వెంకీ తన తొలి సినిమాని బాగానే హ్యాండిల్ చేశారు. హీరో వరుణ్ తేజ్ తన నటనా సామర్థ్యాలను పెంచుకుంటూ వెళుతున్నాడు. రాశీఖన్నా బ్యూటిఫుల్ గా కనిపించడంతో పాటు బాగా నటించింది. ప్రసాద్, బాపినీడుల నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయని, వారికి అభినందనలు తెలుపుతున్నా’ అంతూ తన ఫేస్ బుక్ పేజీలో తెలిపారు.

ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్న ‘తొలిప్రేమ’ థియేటర్స్ లో సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ రికార్డ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఫిదా సినిమాని మించిపోయింది. మొత్తంగా.. వరుణ్ తేజ్ కెరీర్ లోనే తొలిప్రేమ బిగ్గెస్ హిట్ నిలిచిపోయేలా ఉంది.