మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’పై దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి రివ్యూ కూడా వచ్చేసింది. చిన్నా – పెద్దా అన్న తేడా లేకుండా సినిమా చూసిన వెంటనే తన అభిప్రాయాలని చెబుతుంటాడు దర్శకుడు రాజమౌళి.... రాజమౌళి రివ్యూ : ఖైదీ నెం.150

chiru-2
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’పై దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి రివ్యూ కూడా వచ్చేసింది. చిన్నా – పెద్దా అన్న తేడా లేకుండా సినిమా చూసిన వెంటనే తన అభిప్రాయాలని చెబుతుంటాడు దర్శకుడు రాజమౌళి. సినిమాపై చిన్నపాటి రివ్యూనే అందజేస్తాడు. సినిమా బాగుంటే.. ఆ సినిమా రేంజ్ ని మరింత పెంచేలా రాజమౌళి కామెంట్స్ చేస్తుంటాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’పై కూడా రాజమౌళి తన స్పందనని తెలియజేశారు.

“10 సం॥రాలు మెగాస్టార్‌ చిరంజీవిని మిస్‌ అయ్యాం. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ !!. చిరంజీవిగారు తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు. రికార్డు బ్రేకింగ్‌తో నిర్మాతగా తెరంగేట్రం చేసిన చరణ్‌ కు శుభాకాంక్షలు. వినయ్‌గారు.. కుమ్మేశారంతే.. మీకన్నా బాగా ఈ ప్రాజెక్టును ఇంకెవరూ తీయలేరు. టీమ్‌ కేఎన్‌150.. ఇది పెద్ద విజయం” అంటూ ట్విట్ చేశారు రాజమౌళి.

మెగా ఖైదీ సూపర్ హిట్ అని తేలడంతో మెగా అభిమానులు పండగ చేసుకొంటున్నారు. సంక్రాంతి పండగ పూట మెగాస్టార్ విందు భోజనం పెట్టేశాడంటూ చెప్పుకొంటున్నారు. వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టింది.

లేటెస్ట్ గాసిప్స్