రాజ్ తరుణ్ కొత్త ముచ్చట

కెరీర్ ప్రారంభంలో దూకుడు చూపించాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ‘కుమారి 21ఎఫ్’ ఇండస్ట్రీకి మరో మినిమమ్ గ్యారెంటీ హీరో దొరికాడని చెప్పుకొన్నారు. అయితే, ఇమేజ్ ని సుస్థిరం చేసుకోవడంలో ఈ కుర్ర హీరో విఫలమయ్యాడు. ఆయన సినిమాలన్నీ వరుసగా ప్లాపు లిస్టులో చేరిపోతున్నాయి. ‘లవ్వర్’ తర్వాత ఈ కుర్రోడు మరో సినిమాని మొదలెట్టలేదు. దాదాపు 5 నెలల గ్యాప్ తీసుకొన్నాడు. ఈ నేపథ్యంలో ఏంటీ ? కుర్రోడికి ఏమైందనే ప్రచారం జరిగింది. ఐతే, తాజాగా, కొత్త సినిమా కబర్ చెప్పాడు రాజ్ తరుణ్. వచ్చే ఏడాది జనవరిలో తన కొత్త చిత్రాన్ని ప్రకటిస్తానని తెలిపాడు.

కొత్త దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడట. అదెవరు అన్నది మాత్రం చెప్పలేదు. ఈ మధ్య యువ, స్టార్ హీరోలు కొత్త దర్శకులకి పెద్దపీఠ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ కొత్త దారిలో వెళ్లాలని ప్లాన్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ యేడాది పెద్దగా కలిసిరాని రాజ్ తరుణ్.. వచ్చే యేడాదిలోనైనా విజయాలు అందుకుంటాడేమో చూడాలి.